122 కోట్ల టెలికాం వినియోగదారులకు రక్షణ! 1 m ago
TRAI మోసపూరిత ఫేక్ ఫోన్ కాల్స్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. టెలికాం శాఖతో కలిసి, దేశవ్యాప్తంగా ఉన్న 122 కోట్ల వినియోగదారుల రక్షణ కోసం 1.77 కోట్ల ఫేక్ కాల్స్‌కు ఉపయోగించిన నంబర్లను బ్లాక్ చేసింది. రోజూ సుమారు 1.35 కోట్ల ఫేక్ కాల్స్‌ను అడ్డుకోవడమే కాకుండా, భవిష్యత్తులో మరింత భద్రత కోసం బ్లాక్‌చైన్ సాంకేతికతను ఉపయోగించి వినియోగదారుల సమాచారాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు, టెలిమార్కెటింగ్ కాల్స్‌లో కేవలం వైట్‌లిస్ట్‌లో ఉన్న వాటిని మాత్రమే స్వీకరించేందుకు కొత్త విధానాన్ని TRAI ప్రవేశపెట్టింది.